గ్లోబర్ స్టార్ కి వేధింపులు
మీటూ అనేసింది గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా. తను కూడా సెక్సువల్ వేధింపుల బాధితురాలినేనని చెప్పింది. ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రియాంకకు మీరు ఎప్పుడైనా లైంగిక వేధింపులను ఎదుర్కొన్నారా ? అనే ప్రశ్న ఎదురైంది. దానికి ప్రియాంక చెయ్యి పైకెత్తి.. ‘ఔను..నేనూ బాధితురాలినే’నని సమాధానం ఇచ్చింది.
ఎప్పుడు ? ఎక్కడ ?? అనే వివరాలు మాత్రం చెప్పలేదు. దేశంలో #మీటూ ఉద్యమం పీక్స్ లో ఉన్న సమయంలో ప్రియాంక నోరు తెరవలేదు. తనకు అలాంటి అనుభవం ఎదురుకాలేదు అన్నట్టుగా వ్యవహరించింది. ఇప్పుడు పెళ్లి తర్వాత ప్రియాంక.. తనకి ఎదురైన లైంగిక వేధింపులపై నోరు తెరవడం విశేషం.
ప్రస్తుతం ప్రియాంక భర్త నిక్ తో కలిసి అమెరికాలోనే ఉంటుంది. భర్తతో కలిసి బెడ్ రూమ్ లో దిగిన ఫోటోలని కూడా అభిమానులతో పంచుకుంటోంది. బయట కూడా ఈ జంట రొమాంటిక్ గా కనిపిస్తోంది. పబ్లిక్ గానే పెదాలని జుర్రేసుకొంటున్నారు. వీరిని చూసినోళ్లు.. కొత్త పెళ్లి జంట కదా.. ఇంకా మోజు తీరనట్టుందని కామెంట్ చేస్తున్నారు.