విజయ్ దేవరకొండ గల్లీ బాయ్ ?

బాలీవుడ్ హిట్ ‘గల్లీ బాయ్’ తెలుగు రిమేక్ కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. రిమేక్ రైట్స్ ని గీతా ఆర్ట్స్ తీసుకొందనే ప్రచారం జరుగుతోంది. మెగా యంగ్ హీరో సాయిధరమ్ తేజ్ హీరోగా గల్లీ బాయ్ రిమేక్ ఉంటుందనే ప్రచారం జరిగింది. ఐతే, అందులో నిజం లేదని తేజు క్లారిటీ ఇచ్చాడు. ఇప్పుడు గల్లీ బాయ్ గా విజయ్ దేవరకొండ పేరు తెరపైకి వచ్చింది. విజయ్ అయితే సినిమాకు సరైన న్యాయం చేస్తాడనే టాక్ వినిపిస్తోంది.

మేరీ గల్లీ, రూట్స్‌లాంటి హిట్ ర్యాప్ సాంగ్స్ సృష్టికర్త అయిన ఇండియన్ ర్యాపర్ డివైన్ జీవిత చరిత్ర ఆధారంగా గల్లీ బాయ్ తెరకెక్కింది. ఈ చిత్రానికి జోయా అక్త‌ర్ ద‌ర్శ‌క‌త్వం వహించారు. ర‌ణ‌వీర్ సింగ్‌, అలియా భ‌ట్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో నటించారు. దాపు రూ.40 కోట్ల బడ్జెట్‌తో రూపొందించిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద రూ.230 కోట్లు రాబట్టింది. ఇండియ‌న్ క్రిటిక్స్, ఇంట‌ర్నేష‌న‌ల్ ఫిలిం జ‌ర్న‌లిస్ట్స్ నుండి కూడా ప్ర‌శంస‌లు అందుకొంది.

ఈ బాలీవుడ్ హిట్ రిమేక్ లో నటించడానికి విజయ్ దేవరకొండ ఒప్పుకొంటారా ? అన్నది ఆసక్తిగా మారింది. ప్రస్తుతం విజయ్ ‘డియర్‌ కామ్రేడ్‌’ సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు. రష్మిక హీరోయిన్ . భరత్‌ కమ్మ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా మే 31న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా తర్వాత క్రాంతి మాధవ్‌ దర్శకత్వంలో విజయ్ సినిమా ఉండనుంది.