లక్ష్మీ పార్వతీ రీటర్న్ కేసు
ఎన్టీఆర్ మాజీ భార్య, వైకాపా నేత లక్ష్మీ పార్వతీపై కోటి అనే యువకుడు గుంటూరులో లైంగిక వేధింపుల కేసు పెట్టిన సంగతి తెలిసిందే. తన కోరికలు తీర్చాలని లక్ష్మీ పార్వతీ తనపై ఒత్తిడి తెస్తుంది. అలా చేస్తే జగన్ కి చెప్పి వైకాపాలో మంచి పదవి ఇప్పిస్తా. లేదంటే ఇబ్బందులు తప్పవని హెచ్చరించిన పోలీసుల ఫిర్యాదులో కోటి పేర్కొన్నారు. దీనికి సంబంధించి చాటింగ్, రికార్డింగ్ కాల్స్ ని పోలీసుల ముందు ఉంచాడు. కేసు నమోదు చేసుకొన్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
తాజాగా, కోటిపై లక్ష్మీ పార్వతీ రిటర్న్ కేసు పెట్టింది. హైదరాబాద్‌లోని డీజీపీ కార్యాలయానికి వెళ్లి డీజీపీ మహేందర్‌రెడ్డికి కంప్లయింట్ చేసింది. నా ప్రతిష్టకు భంగం కలిగే విధంగా కోటి అనే వ్యక్తి సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. దీని వెనక ఉన్న వ్యక్తులని గుర్తించి చర్యలు తీసుకోవాలని ఆమె కోరింది. ఏపీ పోలీసులపై నమ్మకం లేదని.. అందుకు తెలంగాణ పోలీసులని ఆశ్రయిస్తున్నట్టు లక్ష్మీ పార్వతీ తెలిపింది.