‘జెర్సీ’ సెన్సార్ రివ్యూ

గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో నాని-శ్రద్దా శ్రీనాథ్ జంటగా నటించిన చిత్రం ‘జెర్సీ’. సితార ఎంటర్ టైన్ మెంట్స్ నిర్మిస్తోంది. ఈ వారమే (ఏప్రిల్ 19) జెర్సీ ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. సింగిల్ కట్ లేకుండా క్లీన్ యు సర్టిఫికెట్ లభించింది. సినిమా నివిడి రెండున్నర గంటలగా లాక్ చేశారు.

సినిమాలో నాని ప్రథమార్థం అంతా యంగ్ స్టూడెంట్ గా, ఆపై లవర్ గా, తరువాత థర్టీ ప్లస్ మారీడ్ మన్ గా కనిపిస్తాడు. ఓ మధ్యతరగతి యువకుడి జీవితం, అతని కోరిక, కొడుకుతో అనుబంధం, కొడుకు దృష్టిలో హీరోగా నిలబడాలన్న తపన, ఇవన్నీ కలిసిన కథే జెర్సీ. గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో దర్శకుడు సినిమాని అద్భుతంగా నడిపారని సినిమా చూసిన సెన్సార్ సభ్యుల మాట.