తొలిరోజు 9 బిల్లులు
అసెంబ్లీ సమావేశాల్లో తొలిరోజైన ఈరోజు ప్రశ్నోత్తరాల తరువాత సభ ఆమోదాదనికి ప్రభుత్వం 9 బిల్లులను ప్రవేశపెట్టనుంది. వ్యాట్ చట్ట సవరణ, పీడీ యాక్ట్ సవరణ, పట్టాదారు పాసుపుస్తకాల సవరణ బిల్లు, రోడ్డు డెవలప్మెంట్ కార్పోరేషన్ ఆర్డినెన్సులకు ఆమోదం తెలపనుంది. షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్, ఎక్సైజ్ చట్టాలకు సవరణల బిల్లు ఆమోదం కోసం సభలో ప్రవేశపెడుతారు. ఎన్పీడీసీఎల్ 2015-16 వార్షిక నివేదికను, టీఎస్ టీఎస్ 2015-16 వార్షిక నివేదికను సభ ముందుంచనున్నారు.