గౌతమ్ తిన్ననూరి గొప్ప దర్శకుడు : నాని

‘జెర్సీ’ దర్శకుడు గౌతమ్ తిన్ననూరి గొప్ప దర్శకుడు. ఆయన స్టార్ దర్శకుడు అవుతాడని అన్నారు నాని. ఆదివారం హైదరాబాద్ శిల్పకళావేదికలో ‘జెర్సీ’ ప్రీ రిలీజ్ వేడుక జరిగింది. ఈ వేడుకకి విక్టరీ వెంకటేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఐతే, ఈ ఫంక్షన్ కి దర్శకుడు గౌతమ్ తిన్ననూరి హాజరుకాలేదు. అందుకు గల కారణాన్ని నాని తెలిపారు.

‘గౌతమ్ చెన్నైలో ఉన్నాడు. లాస్ట్ రీల్ మధ్యాహ్నానికి రెడీ అయింది. రాత్రికి యుఎస్ ప్రింట్స్ కి అప్ లోడ్ అవుతున్నాయి. రాత్రి 9గంటలకి డెల్ లైన్. మధ్యాహ్నానికి పనైపోయింది. ఫంక్షన్ కి వస్తున్నావా అంటే.. పనైపోయింది. రావొచ్చు. కానీ రాత్రి 9గంటల వరకు ఇక్కడే ఉంటే ఇంకా బెటర్ చేయగలనేమో అనిపిస్తుంది అన్నారు. అది గౌతమ్ డెడికేషన్. ఈ స్టేజ్ మీద మాట్లాడడు. ఆయన తీసిన సినిమా ఈ నెల 19న మీతో మాట్లాడుతుంది. గౌతమ్ గొప్ప దర్శకుడు అవుతాడు. స్టార్ దర్శకుడు అవుతాడు” అన్నారు నాని.