నానిని అన్న అనేసింది.. !!


‘జెర్సీ’ సినిమాలో నానితో రొమాన్స్ చేసింది శ్రద్దా శ్రీనాథ్. వీరిద్దరి మధ్య హాట్ హాట్ రొమాంటిక్ సీన్స్ ఉన్నాయి. ట్రైలర్ తో ఆ విషయం అర్థమైంది. సినిమాలో ప్రేమికులు, భార్తభర్తలుగా కనిపించనున్నారు. ఈ వారమే (ఏప్రిల్ 19) జెర్సీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆదివారం హైదరాబాద్ లోని శిల్పకళా వేదికలో సినిమా ప్రీ-రిలీజ్ వేడుక ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా హీరోయిన్ శ్రద్దా శ్రీనాథ్ మాట్లాడుతూ.. జై నాని అన్నయ్య అనేసింది. దీంతో నానితో పాటు ఆయన అభిమానులు నర్వస్ గా ఫీలయినట్టు అనిపించింది.

ఇక, స్టేజ్ పై శ్రద్దా తనని తాను పలుమార్లు పరిచయం చేసుకొంది. నా పేరు శ్రద్దా శ్రీనాథ్. థియేటర్ ఆర్టిస్ట్ ని. కన్నడ యూటర్న్ తో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చా. ప్రస్తుతం కన్నడ, తెలుగు, మలయాళం, హిందీ బాషల్లో నటిస్తున్నా. పదే పదే తనని తాను ఎందుకు పరిచయం చేసుకొంటున్నానంటే.. ? ‘జెర్సీ’ సినిమాతో ప్రేక్షకులని తనని గుర్తించుకోవాలని చెప్పుకొచ్చింది శ్రద్దా. దర్శకుడు గౌతమ్ తిన్ననూరి సినిమాని బాగా తీశాడు. గొప్ప గొప్ప వాళ్లతో కలిసి పని చేయడం ఆనందంగా ఉందన్నారు శ్రద్దా.