‘జెర్సీ’ బ్లాక్ బస్టర్.. అంతకుమించి !


నేచురల్ స్టార్ నాని ‘జెర్సీ’ సినిమాపై గట్టి నమ్మకంతో ఉన్నాడు. ఇప్పటికే సినిమాని 20సార్లు చూసేశాడు. పిచ్చి పిచ్చిగా నచ్చేసింది. తనలాగే ప్రేక్షకులకి జెర్సీ ఎక్కుతుంది. హిట్ ఖాయం అనుకోవడంలో తప్పులేదు. కానీ, నాని ఏకంగా బ్లాక్ బస్టర్ హిట్.. ‘జెర్సీ’కి చాలా తక్కువ. అంతకుమించిన విజయం సాధిస్తుందని ధీమాగా చెబుతున్నాడు. హిట్, బ్లాక్ బస్టర్.. రొటీన్. జెర్సీ ప్రేక్షకులని హృదయాలని టచ్ చేసే సినిమా. ఈ సినిమా చేసినందుకు గర్విస్తున్నా. సినిమా చూసిన తర్వాత అభిమానులు గర్వపడతారని అన్నారు నాని.

ఇటీవలే విడుదలైన ‘జెర్సీ’ ట్రైలర్ ని చూస్తే.. నాని మాటల్లో నిజం ఉందని అనిపిస్తుంది. సినిమాలో నాని ప్రథమార్థం అంతా యంగ్ స్టూడెంట్ గా, ఆపై లవర్ గా, తరువాత థర్టీ ప్లస్ మారీడ్ మన్ గా కనిపిస్తాడు. ఓ మధ్యతరగతి యువకుడి జీవితం, అతని కోరిక, కొడుకుతో అనుబంధం, కొడుకు దృష్టిలో హీరోగా నిలబడాలన్న తపన, ఇవన్నీ కలిసిన కథే జెర్సీ. గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో దర్శకుడు సినిమాని అద్భుతంగా నడిపారని నాని చెబుతున్నాడు. గౌతమ్ తిన్ననూరి గొప్ప దర్శకుడు. స్టార్ డైరెక్టర్ అవుతాడని కితాబిచ్చాడు.