తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు

కొత్త రెవెన్యూ, కొత్త పురపాలక చట్టాలని తీసుకొచ్చే పనిలో బిజీగా ఉన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. అంతేకాదు.. ఈ కొత్త చట్టాలకు సంబంధించిన బిల్లుల ఆమోదం కోసం త్వరలో శాసనసభ సమావేశాలు నిర్వహించబోతున్నారు. వచ్చే నెల మూడో వారంలో శాసనసభ సమావేశాలు నిర్వహించాలని సీఎం కేసీఆర్‌ భావిస్తున్నారు. నాలుగు రోజుల పాటు జరిగే అవకాశం ఉంది.

కొత్త రెవెన్యూ, కొత్త పురపాలక బిల్లులపై చర్చించి, ఆమోదం తీసుకోవాలని యోచిస్తున్నారు. వీటిపై ఇప్పటికే సీఎం కసరత్తు చేపట్టారు. అధికారులు, నిపుణులతో చర్చిస్తున్నారు. ఈ కొత్త చట్టాలకు సంబంధించిన బిల్లుల ఆమోదం కోసం ఏయే తేదీల్లో శాసనసభ నిర్వహించా
లో పరిశీలిస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు త్వరలో నోటిఫికేషన్‌ వెలువడనుంది. వచ్చే నెల 14తో ఎన్నికలు ముగిస్తే 15 నుంచి 23 మధ్యలో సమావేశాలు నిర్వహించనున్నట్టు తెలిసింది.