బౌన్సర్‌కు రసెల్‌ విలవిల


కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ప్రధాన ఆటగాడు ఆండ్రీ రసెల్‌ గాయపడ్డాడు. నెట్స్ లో సాధన చేస్తుండగా బౌలర్‌ మినాద్‌ మంజ్రేకర్‌ విసిరిన బౌన్సర్‌ అతడి మెడకు బలంగా తాకింది. వెంటనే అతడు నొప్పితో విలవిల్లాడాడు. వెంటనే అతడిని సీఎంఆరై ఆస్పత్రిలో ఎమ్మారై స్కాన్‌ చేయించారు. అతడి పరిస్థితి ఏంటో తెలియాలి. కోల్‌కతా నైట్‌రైడర్స్‌ తన తదుపరి మ్యాచ్ రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుతో తలపడనుంది. ఈ రెండు జట్ల మధ్య జరగనున్న రెండో మ్యాచ్ ఇది. మొదటి మ్యాచ్ లో కోల్ కతా గెలుపొందింది. రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుతో జరిగిన తొలి మ్యాచ్‌లో రసెల్‌ 13 బంతుల్లో 48 పరుగులతో ఊచకోత కోసిన సంగతి తెలిసిందే.