రివ్యూ : జెర్సీ
చిత్రం : జెర్సీ (2019)
నటీనటులు : నాని, శ్రద్ధా శ్రీనాథ్, సత్యరాజ్, బ్రహ్మాజీ, సుబ్బరాజు, రాహుల్ రామకృష్ణ, సంపత్ రాజ్, ప్రవీణ్ తదితరులు
సంగీతం: అనిరుధ్ రవిచందర్
దర్శకత్వం: గౌతమ్ తిన్ననూరి
నిర్మాత : సూర్య దేవర నాగవంశీ
నిర్మాణ సంస్థ : సితార ఎంటర్‌టైన్‌మెంట్స్
రిలీజ్ డేటు : 19ఏప్రిల్ 2019.
రేటింగ్ : 4/5
కథల ఎంపికలో మంచి అభిరుచి ఉన్న కథానాయకుడు నాని. ఆయన నటించిన తాజా చిత్రం జెర్సీ. గౌతమ్ తిన్ననూరి దర్శకుడు. శ్రద్దా శ్రీనాథ్ హీరోయిన్. విడుదలకి ముందే హిట్, సూపర్ హిట్, బ్లాక్ బస్టర్ హిట్ లాంటి పదాలు ఈ సినిమా ముందు చాలా చిన్నవి అన్నారు నాని. అంతకుమించిన విజయాన్ని జెర్సీ అందుకుంటుంది అన్నారు. మరీ.. అది నిజమేనా ? తెలుసుకొనేందుకు జెర్సీ రివ్యూలోకి వెళదాం పదండీ.. !
కథ :
అర్జున్ (నాని) కు క్రికెట్ అంటే పంచప్రాణాలు. క్రికెటర్ గా ఎదుగుతున్న సమయంలో సారా (శ్రద్దా శ్రీనాధ్) అనే ఓ క్రిష్టియన్ అమ్మాయితో ప్రేమలో పడతాడు. వీరి వివాహానికి పెద్దలు ఒప్పుకోకపోవటంతో… అందరినీ కాదనుకుని బయిటకు వచ్చేసి పెళ్లి చేసుకుంటారు. పెళ్లి తర్వాత అర్జున్ క్రికెట్ ఆడటం మానేసి తన భార్య సంపాదనతో బ్రతుకు ఈడుస్తూంటాడు. వాళ్లకో అబ్బాయి పేరు నాని. వాడు క్రికెట్ అభిమానే. బాబు పుట్టాక.. అతడే అర్జున్ లోకం అయిపోతాడు.
కానీ, సంపాదన లేకపోవటం, తను అనుకున్న కెరీర్ దొరక్క పోవటంతో ఓ రకమైన నిరాశ అతన్ని ఆక్రమిస్తుంది. తన కొడుకు పుట్టిన రోజుకు ఓ ఐదు వందలు పెట్టి గిప్ట్ కొనివ్వలేని పరిస్థితి అర్జున్ ది. అలాంటి స్థితిలో అర్జున్ మళ్లీ క్రికెటర్ గా ఫీల్డ్ కు వెళ్లాలనుకుంటాడు. ఇండియన్ క్రికెట్ టీమ్ తరుపున ఆడాలనుకుని నిశ్చయించుకుంటాడు. 36యేళ్ల మిడిల్ ఏజ్ లో అర్జున్ చేసిన ప్రయత్నాలకు ఏ అడ్డంకులు వచ్చాయి.. వంటి ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ప్లస్ పాయింట్స్ :
* కథ-కథనం
* నాని నటన
* క్లైమాక్స్
* నేపథ్య సంగీతం
* భాగోద్వేగాలు
మైనస్ పాయింట్స్ :
* అక్కడక్కడ స్లో నేరేషన్
* సినిమా నివిడి
ఎలా ఉందంటే ?
అర్జున్ అనే క్రికెటర్ 26 ఏళ్ల వయసులోనే ఆటకు గుడ్ బై చెప్పి.. మళ్లీ పదేళ్ల తర్వాత ఎందుకు బ్యాట్ చేతబట్టాడు, ఏం సాధించాడు అనే విషయం చుట్టూ కథ తిరుగుతుంది. ఈ కథని చాలా గ్రిప్పింగ్ ప్రజెంట్ చేశాడు. స్క్రీన్ ప్లే తో ఎమోషనల్ రైడ్ గా మార్చాడు దర్శకుడు గౌతమ్ తిన్ననూరి. కథని 1986 .. 1996.. 2018 సంవత్సరాలలో చూపించిన తీరు ఆకట్టుకుంది. తండ్రి కథను కొడుకు తప్ప ఇంకెవరు అంత గొప్పగా నేరేట్ చేయగలరు. ఇందులోనూ క్రికెటర్ అర్జున్ కథని అతడి కొడుకు నాని పాయింట్ ఆఫ్ వ్యూలో నేరేట్ చేయడం ఆకట్టుకొంది. క్యారక్టర్స్ ని చాలా నీట్ గా రాసుకున్నాడు. ఇటీవల కాలంలో ఇంత గొప్ప క్లైమాక్స్ ని చూడలేదు. హీరో విల్ పవర్ ని సరిగ్గా ప్రొజెక్టు చేసి స్పూర్తి నింపే ప్రయత్నం చేశాడు దర్శకుడు. మొత్తంగా ఇది దర్శకుడి సినిమా.
ముఖ్యంగా నటుడుగా నాని బలాలు, బలహీనతలను కరెక్ట్ అంచనా వేసి ఆ కొలతల్లోనే సినిమాని పరుగెట్టించాడు. జీవితంలో ఇంకేమీ చెయ్యలేము అనుకుని మిడిల్ లైఫ్ క్రైసిస్ ని ఎదుర్కొనే వ్యక్తి… మళ్లీ తనను ప్రూవ్ చేసుకుని తనకు ఆత్మధైర్యాన్ని, తన కొడుక్కు గర్వాన్ని గిప్ట్ గా అందిస్తాడు అనేది చూపించటంలో డైరక్టర్ పూర్తి గా సక్సెస్ అయ్యాడు.
ఎవరెలా చేశారంటే ?
అర్జున్ పాత్రలో నాని ఒదిగిపోయాడు. స్ఫూర్తి నింపే పాత్రలో అద్భుతంగా నటించారు. నాని కెరీర్ లోనే బెస్ట్ ఫర్ ఫామెన్స్ ఇచ్చాడు. ఎమోషనల్ సీన్స్ లో నాని నటన అద్భుతం. నాని తన సహజ నటనతో సిక్సర్ కొట్టి సినిమా గెలిపించాడని చెప్పవచ్చు. జీవితంలో ఇంకేమీ చెయ్యలేము అనుకుని మిడిల్ లైఫ్ క్రైసిస్ ని ఎదుర్కొనే వ్యక్తి… మళ్లీ తనను ప్రూవ్ చేసుకుని తనకు ఆత్మధైర్యాన్ని, తన కొడుక్కు గర్వాన్ని గిప్ట్ గా అందిస్తాడు. హీరోయిన్ శ్రద్దా దాస్ నటనతో ఆకట్టుకొంది. కోచ్ గా సత్యరాజ్ నటన ఆకట్టుకొంది. మిగితా నటీనటులు తమ తమ పరిధి మేరకు బాగానే నటించారు.
సాంకేతికంగా :
అనిరుధ్ నేపథ్య సంగీతంతో మేజిక్ చేశాడు. అది సినిమాని మరో స్థాయికి తీసుకెళ్లి నిలబెట్టింది. ముఖ్యంగా ఎమోషనల్ సన్నివేశాల్లో నేపథ్య సంగీతం బాగా కుదిరింది. ఫోటోగ్రఫీ బాగుంది. అక్కడ సినిమా స్లో గా సాగింది. నివిడి చాలా ఎక్కువే. ఒకట్రెండు చిన్ని చిన్న నెగటివ్స్ తప్ప సినిమానికి వంక పెట్టాల్సిన పనిలేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి.
చివరగా : ‘జెర్సీ’ ఎమోషనల్ జర్నీ. మనసుల్లో స్పూర్తిని నింపే జర్నీ.
రేటింగ్ : 4/5