దీదీ సేఫ్ గేమ్.. జగన్’తో మంతనాలు !
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సేఫ్ గేమ్ ఆడుతున్నారు. ఆమె ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మనిషి. ఇటీవల ఏపీ ఎన్నికల్లో చంద్రబాబుతో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొంది. కేంద్రంలో కాంగ్రెస్ తో కలిసి బీజేపీ యేతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని పరితపిస్తున్న చంద్రబాబుకు గట్టిగా మద్దతిస్తున్నారు దీదీ. అదే సమయంలో ఆమెకు ప్రధాని పదవిపై పెద్ద ఆశలే ఉన్నాయి. కాంగ్రెస్ తో కలిసి వెఌతే.. తన ప్రధాని కల నెరవేరడం కష్టం అనుకున్నట్టుంది మమత. అందుకే దీదీ రూటు మార్చింది.
వైకాపా అధినేత వైఎస్ జగన్ తో మమతా మంతనాలు జరుపుతున్నట్టు సమాచారమ్. ఓ వైపు చంద్రబాబుతో సన్నిహితంగా ఉంటూనే మరోవైపు జగన్ ను తన వైపు తిప్పుకునేందుకు ఆమె పావులు కదుపుతున్నట్లు అర్థమవుతోంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మమతా మాట్లాడుతూ.. కేంద్రంలో నాన్ ఎన్డీఎ, నాన్ యుపిఎ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది.ఫెడరల్ ఫ్రంట్ నేతలంతా చర్చలు
జరిపి ప్రధాని అభ్యర్థిని ఎంపిక చేసుకుంటారని తెలిపింది.
ఇప్పటికే కేంద్రంలో ఫెడరల్ ఫ్రంట్ కోసం తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రయత్నాలు చేస్తున్నారు. దీనిపై పలు పార్టీల నేతలతో చర్చలు కూడా జరిపారు. జగన్ కూడా కేసీఆర్ తోనే ఉన్నారు. వీరిద్దరు కలిసి ఫెడరల్ ఫ్రంట్ కోసం మరో 140 ఎంపీ సీట్లని మాట్లాడరనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో మమతా బెనర్జీ జగన్ వైపు చూస్తున్నట్టు తెలుస్తోంది.
ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ కూడా గతంలో కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ పై ప్రసంశలు కురిపించిన సంగతి తెలిసిందే. ఎన్నికల తర్వాత మమత, అఖిలేష్ లాంటి నేతలు చంద్రబాబు హ్యాండి ఇచ్చి.. కేసీఆర్ ఫ్రెడరల్ ఫ్రంట్ లో చేరే అవకాశాలు కనిపిస్తున్నట్టు రాజకీయ విశ్లేషకుల మాట. అదే జరిగితే.. కేసీఆర్ చెబుతున్నట్టుగా కేంద్రంలో నాన్ బీజేపీ, నాన్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కావడం ఖాయం.