సీఎం రమేశ్ మేనల్లుడు ఆత్మహత్య

తెదేపా ఎంపీ సీఎం రమేశ్ మేనల్లుడు ఆత్మహత్య చేసుకొన్నాడు. సీఎం రమేశ్‌ అక్క కుమారుడు ధర్మారామ్‌. అమీర్‌పేట్‌లోని నారాయణ కళాశాలలో ఇంటర్ చదువుతున్నాడు. గణితం పరీక్షలో ఫెయిల్ అవడంతో మానసికంగా ఒత్తిడికి గురయ్యాడు. దీంతో శ్రీనగర్‌ కాలనీలోని వాసవి భువన అపార్ట్‌మెంట్‌లోని ఐదో అంతస్తు నుంచే దూకేశాడు. తీవ్ర గాయాలతో ఆయన్ని యశోద ఆసుపత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు.

సీఎం రమేశ్‌ అక్క కుటుంబం చాన్నాళ్లుగా శ్రీనగర్‌ కాలనీలోని వాసవి భువన అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటున్నారు. తన తండ్రి, సోదరికి మెసేజ్ పెట్టిన అనంతరం ధర్మారామ్ ఆరో అంతస్తు టెర్రస్ పైకి వెళ్లి అక్కడి నుంచి కిందికి దూకేశాడు. అదే సమయంలో ఐదో అంతస్తులో ఉన్న ధర్మారామ్‌ సోదరి శబ్దం విని వెళ్లి చూడగా రక్తపు మడుగులో కనిపించాడు. చాలా వేగంగా ధర్మారామ్ ని ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకుండా పోయింది.