ఈసీ ఆంక్షలు ఏపీలో మాత్రమేనా ?
ఏపీలో ఎన్నికల నియమావళి పేరుతో ప్రభుత్వ పరంగా చేసే సమీక్షలపై ఈసీ ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. ఐతే, ఎన్నికల నియమావళి ఒక్క తెదేపాకి మాత్రమే వరిస్తుందా అని ఏపీ సీఎం చంద్రబాబు ప్రశ్నించారు. శనివారం చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా తిరుపతిలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నా.. ప్రధాని మోదీ అధికారులతో సమీక్షలు చేయడం ఏంటని ప్రశ్నించారు.
ఆంక్షలు అనేవి అందరికీ వర్తిచాలని.. కొందరిపై పెట్టడం సరికాదని అభిప్రాయపడ్డారు. ఈసీ ఆంక్షలు కేవలం ఏపీకి మాత్రమే పెట్టడం ఏంటని నిలదీశారు. బీజేపీ తప్ప మిగిలిన పార్టీ నేతలపై ఐటీ దాడులు చేయడం దేనికి సంకేతమని ప్రశ్నించారు. ఈసీపై తన పోరాటం కొనసాగుతుంది స్పష్టం చేశారు. ఇక, ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో తెదేపా 110 నుంచి 140 సీట్లు గెలుచుకుంటుందని.. మరోసారి తెదేపా అధికారంలో వస్తుందని చంద్రబాబు ధీమా వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే.