సచిన్ కథనంలోంచి పుట్టిన కథ.. జెర్సీ !
జెర్సీ సినిమాని చూసి టాలీవుడ్ గర్విస్తోంది. అంత గొప్పగా తీశాడు గౌతమ్ తిన్ననూరి. కథ-కథనంతో కట్టిపడేశాడు. ప్రేక్షకుడిని ఎమోషనల్ జర్నీ చేయించాడు. ఈ ఎమోషనల్ జర్నీకి టాలీవుడ్ స్టార్స్ తారక్, బన్నీ.. సైతం ఫిదా అయ్యారు. ఇంతకీ జెర్నీకథ స్పూర్తి ఎవరో తెలుసా ? మన క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్. ఆయనపై హర్ష బోగ్లే ఇచ్చిన ఇంటర్వ్యూ దర్శకుడు గౌతమ్ ని ఆకర్షించిందట. ఆ లైన్ తోనే గౌతమ్ జెర్సీ కథని అల్లుకొన్నాడు.
ఈ దేశంలో చాలా మంది క్రికెటర్లు ఉన్నా, సచిన్ ఒక్కరే గొప్ప క్రికెటర్ కావడానికి వెనుక కారణాలేంటీ ? అన్నది హర్ష బోగ్లే తన ఇంటర్వ్యూలో చెప్పారట. సచిన్ స్థాయిలో కష్టపడి అనేక కారణాల వల్ల వెలుగులోకి రాని ఎందరో ప్రతిభావంతుల జీవితాలు ఎవరికీ కనపడవు. ‘జెర్సీ’తో ఈ విషయాన్నే చూపించాడు దర్శకుడు. అలాగని ఇది ఏ క్రికెటర్ జీవితాధారంగానో తెరకెక్కించిన సినిమా కాదు. వారి జీవితాలని ప్రతిబింభించే సినిమా మాత్రమే. క్రికెటర్ అర్జున్ జీవిత కథని ఎమోషనల్ జర్నీగా మార్చి శభాష్ అనిపించుకొన్నాడు గౌతమ్ తిన్ననూరి.