‘జెర్సీ’ తప్పిదాలు గమనించారా.. ?

జెర్సీ సినిమా ప్రీ-రిలీజ్ వేడుకకు దర్శకుడు గౌతమ్‌ తిన్ననూరి రాలేదు. దీంతో సినిమా విశేషాలు పూర్తి స్థాయిలో తెలియలేదు. ఐతే, ఈ సినిమా సక్సెస్ మీట్ లో దర్శకుడు గౌతమ్‌ ఆసక్తికర విషయాలు చెప్పారు. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ గురించి హర్ష బోగ్లే ఇచ్చిన ఇంటర్వ్యూ స్పూర్తిగా జెర్సీ కథని రెడీ చేసుకొన్నాడట. అంతేకాదు.. సినిమాలో నాని, విశ్వాంత్‌ తప్ప మిగిలిన వారంతా నిజం క్రికెటర్లేనని తెలిపాడు. అందుకే క్రికెట్ కు సంబంధించిన సన్నివేశాలు అద్భుతంగా వచ్చినట్టున్నాయి.

ఇక, జెర్సీ సినిమాలో ఒకట్రెండు తప్పిదాలు కూడా జరిగాయట. వాస్తవంగా డేనైట్‌ క్రికెట్ మ్యాచ్‌లకు ఎర్ర బంతితో ఆడరు. తెల్ల బంతితో ఆడతారు. ఐతే, సినిమాలో క్రికెటర్ల జెర్సీ తెల్లరంగులో ఉన్నాయి కాబట్టి.. చిత్రీకరణ సౌలభ్యం కోసం ఎర్రబంతి వాడాం. గులాబీ రంగు బంతి కూడా వాడొచ్చన్నది తర్వాత గుర్తొచ్చిందన్నారు గౌతమ్‌.