పంజాబ్ పై ఢిల్లీ గెలుపు
అశ్విన్ సేన నిర్దేశించిన 164 పరుగుల లక్ష్యాన్ని మరో 2 బంతులు మిగిలుండగానే ఛేదించింది దిల్లీ క్యాపిటల్స్. ఢిలీ ఆరంభం అదిరింది. 10 ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టపోయి 90 పరుగులు చేసింది. శిఖర్ ధావన్ (56; 41 బంతుల్లో 7×4, 1×6) మెరుపులు మెరిపించాడు. ధావన్ అవుటయ్యాక ఢిల్లీ స్కోర్ నెమ్మదించింది. 15 ఓవర్లకు 128/2తో నిలిచింది. ఆ జట్టు విజయానికి చివరి 30 బంతుల్లో 36 పరుగులు అవసరం అయ్యాయి. శ్రేయస్ అయ్యర్ 58 అజేయ అర్ధశతకంతో కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు.
అంతకుముందు క్రిస్‌గేల్ (69; 37 బంతుల్లో 6×4, 5×6) బీభత్సం సృష్టించాడు. మన్దీప్ సింగ్ (30; 27 బంతుల్లో 1×4, 1×6), హర్పీత్ బ్రార్ (20 నాటౌట్; 12 బంతుల్లో 2×4, 1×6) ఆకట్టుకున్నారు. వర్లో అశ్విన్(16), హర్పీత్‌బ్రార్(20) బౌండరీలు బాదడంతో పంజాబ్ స్కోర్ 160 పరుగులు దాటింది. ఈ విజయంతో ప్లేఆఫ్ చేరేందుకు పటిష్ఠ పునాది వేసుకుంది దిల్లీ క్యాపిటల్స్.