130దాటిన శ్రీలంక మృతుల సంఖ్య

శ్రీలంక రాజధాని కొలంబోలో విషాదం చోటు చోసుకొంది. వరుసగా ఆరు చోట్ల బాంబు పేలుళ్లు జరిగాయి. మూడు చర్చీలు, మూడు హోటల్స్ లో ఈ దాడులు జరిగాయి. ఈస్టర్‌ సండే సందర్భంగా ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్న భక్తులనే లక్ష్యంగా దుండగులు దాడులకు పాల్పడ్డట్లు తెలుస్తోంది.

ఉదయం 8.45 ప్రాంతంలో కొలంబోలోని ఒక చర్చితోపాటు మూడు ఫైవ్‌ స్టార్‌ హోటళ్లలో బాంబులు పేలాయి. కొలంబోలోని సెయింట్‌ ఆంటోనీ, నెగోంబో పట్టణంలోని సెయింట్‌ సెబాస్టియన్‌, బాట్టికలోవాలోని మరో చర్చితో పాటు శాంగ్రిలా, సిన్నామన్‌ గ్రాండ్‌, కింగ్స్‌బరి హోటళ్లలో పేలుళ్లు సంభవించాయి. ఈ దాడుల్లో ఇప్పటి వరకు 138 మంది మృతిచెందినట్లు సమచారం. 400 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డట్లు తెలుస్తోంది. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశాలున్నాయని సమాచారమ్.