శ్రీలంక బాంబు పేలుళ్లు.. ఐసిస్ పనే !


శ్రీలంక రాజధాని కొలంబోలో వరుస బాంబు పేలుళ్లు.. ఐసిస్ ఆత్మాహూతి దళ సభ్యులు పనేనని తేలింది. ఈ మేరకు శ్రీలంక భద్రతా వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. జహ్రెయిన్ హుస్సేన్, అబు మొహమ్మద్ అనే ఉగ్రవాదులు రెండు ప్రాంతాల్లో ఆత్మాహూతి దాడులకు పాల్పడినట్లు అధికారులు ధృవీకరించారు. జిహాద్ పేరుతో దాడులు చేసినట్లు గుర్తించారు.

షాంగ్రిలా హోటల్, బట్టికలోవాలోని చర్చిపై ఉగ్రవాదులు ఆత్మహుతి దాడికి పాల్పడినట్టు తేలింది. దీంతో.. మిగితా నాలుగు చోట్ల ఇదే రకంగా ఉగ్రవాదులు తమని తాము పేల్చుకొని మారణకాండని సృష్టించి ఉంటారని భావిస్తున్నారు. రియాపై పట్టు కోల్పోయిన తరువాత ఐసిస్.. భారీ ఎత్తున మారణ హోమానికి పాల్పడటం ఇదే తొలిసారి.

ఇంత పెద్ద ఎత్తున దాడులు చేయడం ఐసిస్ చరిత్రలో కూడా ఇదే తొలిసారి అయి ఉండొచ్చని అంటున్నారు. గుడ్ ఫ్రైడేకు ముందు రోజు లేదా అంతకుముందే- ఐసిస్ ఉగ్రవాదులు శ్రీలంక చేరుకుని ఉండొచ్చని అనుమానిస్తున్నాయి. ఆరు చోట్ల జరిగిన దాడుల్లో ఇప్పటి వరకు 130మందిపైగా మృతి చెందారు. మరో 300మందికి తీవ్ర గాయాలు అయినట్టు తెలుస్తోంది.