శంకర్ @25 ఇయర్స్ సెలబ్రేషన్స్

భారతీయ సినిమా గర్వించదగ్గ దర్శకుల్లో శంకర్ ఒకరు. ఆయన నుంచి జెంటిల్ మేన్, భారతీయుడు, అమరిచితుడు, రోబో.. లాంటి అద్భుతమైన సినిమాలొచ్చాయ్. గత యేడాది ప్రేక్షకుల ముందుకొచ్చిన శంకర్ 2.ఓ ప్రపంచ ప్రేక్షకులని ఆకట్టుకొంది. ఏప్రిల్ 21తో శంకర్ కి 25యేళ్లు నిండాయి. దర్శకుడిగా ఆయన ప్రస్థానం 25యేళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా.. కోలీవుడ్ దర్శకులతో కలిసి శంకర్ సెలబ్రేషన్స్ చేసుకొన్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ప్రస్తుతం శంకర్ ‘భారతీయుడు 2’ సినిమా చేస్తున్నారు. కమల్ హాసన్ కి స్కిన్ ఎలర్జీ వలన ఈ సినిమా షూటింగ్ ఆగిపోయినట్టు తెలుస్తోంది. తిరిగి ఎప్పుడు ప్రారంభం అవుతుంది అన్నది తెలియాల్సి ఉంది. మరోవైపు, శంకర్ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి సినిమాకు ప్రయత్నాలు జరుగుతున్నట్టు సమాచారమ్. ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. మెగాస్టార్ తో సినిమా చేయాలనే కోరికని దర్శకుడు శంకర్ పలుమార్లు బయటపెట్టాడు. త్వరలోనే ఆ కోరిక తీరబోతున్నట్టు సమాచారమ్.