పాకిస్థాన్‌ను సరైన గాడిలో పెట్టాలంటే.. ?

గత రెండేళ్లలో పాకిస్థాన్‌పై భారత్‌ రెండు సార్లు మెరుపుదాడులని నిర్వహించిన సంగతి తెలిసిందే. తొలిసారి నిర్వహించిన మెరుపుదాడులకు ఉత్తర ఆర్మీ కమాండర్‌ లెఫ్టినెంట్‌ జనరల్‌ డీఎస్‌ హూడా నేతృత్వం వహించారు. ఇప్పుడీయన విశ్రాంత్రి తీసుకొంటున్నారు. ఇటీవల హుడా ఓ చర్చావేదికలో పాల్గొన్నారు. భారత్‌-పాకిస్థాన్‌ మధ్య నెలకొన్న పరిస్థితులపై మాట్లాడారు.

“ఒక్క మెరుపు దాడితో పాకిస్థాన్‌ తన ప్రవర్తనను మార్చుకుంటుందనుకోవడం పొరపాటు. పాకిస్థాన్‌ను సరైన గాడిలో పెట్టాలంటే ఎక్కువ సమయం కేటాయించాల్సి ఉంటుంది. సరైన వ్యూహాలతో ముందుకెళ్లాలి. కశ్మీర్‌లో మునుపటి కంటే జాతి వాదం, ఉద్రేకం పెరిగిపోతున్నాయి. కశ్మీర్‌ విషయంలో పాక్‌ జోక్యం ఎంతో ప్రమాదకరం. అగ్నికి ఆజ్యం పోసినట్లవుతుంది. ఇక భారత్‌ కూడా జమ్ముకశ్మీర్‌ను వదులుకోవడానికి సిద్ధంగా లేదు. కాబట్టి పాక్‌తో దీర్ఘకాలిక చర్చలకు మన దేశం సిద్ధంగా ఉండాలి’ అన్నారు హుడా.