రాజకీయాలకి గుడ్ బై చెప్పిన బండ్ల గణేష్

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకి ముందు టాలీవుడ్ బడా నిర్మాత బండ్ల గణేష్ రాజకీయ రంగ ప్రవేశం చేసిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సమక్షంలో ఆ పార్టీలో చేరారు. ఆయనకి పార్టీ అధికార ప్రతినిధి పదవిని కూడా ఇచ్చింది. ఆ హోదాలో బండ్ల చేసిన వ్యాఖ్యల్లో కొన్ని సంచలనంగా మారాయి. తెలంగాణలో మహాకూటమి అధికారంలోకి వస్తుంది. లేకుంటే బ్లేడ్ తో తన గొంతుని కోసుకొంటానని బండ్ల అన్నారు. ఐతే, ఇప్పుడు బండ్ల రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకొంటున్నట్టు ప్రకటించారు. ఓ టీవీ ఛానల్ కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో బండ్ల రాజకీయ సన్యాసం ప్రకటన చేశారు.

రాజకీయాలు తనకి సరిపడవు. రాజకీయాల్లో ఉండటం కారణంగా మిత్రులకి దూరం అవుతున్నా. అది నాకు నచ్చడం లేదు. నాకు రాజకీయాల చేయడం రాదు. అందుకే తప్పుకొంటున్నా అన్నారు బండ్ల. అదే సమయంలో టీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గురించి ఆసక్తిక కామెంట్ చేశాడు బండ్ల. ఎన్నికల సమయంలో తాను టీఆర్ఎస్ పై చాలా ఆరోపణలు చేశా. కేసీఆర్ ని విమర్శించా. అయినా.. అవేవి మనసులో పెట్టుకోకుండా మా పిల్లల్ని కేటీఆర్ తన ఇంటికి తీసుకెళ్లాడని చెప్పాడు. ఇక, ఏపీలో పవన్ కల్యాణ్ అధికారంలోకి రావాలని కోరుకుటున్నట్టు తెలిపారు బండ్ల. మొత్తానికి బండ్ల పొలిటికల్ కెరీర్ కి బ్రేక్ పడిండి.