చరణ్’ని సప్రైజ్ చేసిన జపాన్ ఫ్యాన్స్


తెలుగు సినిమాలకి జపాన్ లో మంచి డిమాండ్ ఉంటుందన్న సంగతి తెలిసిందే. ఇక్కడ స్టార్స్ అక్కడ మంచి క్రేజ్ ఉంది. బాహుబలి హీరోలు ప్రభాస్, రానాకు ఓ రేంజ్ లో అభిమానులున్నారు అక్కడ. జపాన్ ప్రజలు రానా, ప్రభాస్ కోసం బోలేడు ఉత్తరాలు రాయడం చూశాం. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కి జపాన్ లో మంచి ఫాలోయింగ్ ఉంది.

మగధీర సినిమా జపాన్ లోనూ బాగా ఆడింది. తాజాగా, జపాన్ అభిమానుల తనని విష్ చేస్తూ రాసిన ఉత్తరాలని రామ్ చరణ్ షేర్ చేశాడు. అందులోని కొందరు ట్విట్టర్ ఎకౌంట్ లని ఓ పేపర్ లో రాశాడు చరణ. ఈ సందర్భంగా జపాన్ అభిమానులకి థ్యాంక్స్ చెప్పాడు. త్వరలోనే మిమ్మల్ని కలుస్తానని చెప్పాడు.

ప్రస్తుతం రామ్ చరణ్, తారక్ కలిసి రాజమౌళి మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’లో నటిస్తున్నారు. అల్లూరి సీతారామరాజు, కొమరంభీమ్ ల కథతో తెరకెక్కుతోన్న చిత్రమిది. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. దాదాపు 400కోట్ల బడ్జెట్ తో డివివి దానయ్య నిర్మిస్తున్నారు. 2020 జూన్ 30న ఆర్ ఆర్ ఆర్ ప్రేక్షకుల ముందుకు రానుంది.