మహేష్ లేకుండానే విజయశాంతి సినిమా.. !

టాలీవుడ్ గ్రేట్ దర్శకుల్లో అని రావిపూడి ఒకరు. పటాస్, సుప్రీమ్, రాజా ది గ్రేట్, ఎఫ్ 2 సినిమాలతో విజయాలు అందుకొన్నారు. ఆయన తదుపరి సినిమా సూపర్ స్టార్ మహేష్ తో ఉండనుంది. ఇందులో లేడీ సూపర్ స్టార్ విజయశాంతి కీలక పాత్రలో నటించనున్నారు. ఆమెది సినిమాలో పవర్ ఫుల్ పాత్రని చెబుతున్నారు. మహేష్’తో సమానంగా విజయశాంతి పాత్రకి ప్రాధాన్యత ఉండనుందట. అందుకే ఆమె మహేష్ సినిమాకి ఓకే చెప్పిందని టాక్.

మరోవైపు, మహేష్ లేకుండానే అనిల్ రావిపూడి దర్శకత్వంలో విజయశాంతి సినిమా రాబోతుందనే ప్రచారం జరుగుతోంది. తన తదుపరి సినిమాగా ఓ లేడీ ఓరియెంటెడ్ సినిమాని తీస్తానని ‘ఎఫ్ 2’ సినిమా సక్సెస్ మీట్ లో దర్శకుడు అనిల్ రావిపూడి చెప్పిన సంగతి తెలిసిందే. ఆ సినిమాని విజయశాంతినే ప్లాన్ చేశాడట అనిల్. ఆడవాళ్ల సమస్యల నేపధ్యంలో సాగే కథలో.. అనిల్ మార్క్ ఎంటర్టైనర్ గా సినిమా ఉండబోతుందట.

మహేష్ సినిమా కంటే ముందే విజయశాంతితో అనిల్ లేడీ ఓరియెంటెడ్ సినిమా రాబోతుందని సమాచారమ్. ఇందుకు మహేశ్ కూడా ఓకే చెప్పాడట. కేవలం ఒకట్రెండు నెలల్లోనే సినిమాని పూర్తి చేసే విధంగా అనిల్ ప్లాన్ చేసుకొన్నాడట. ఆ తర్వాత మహేష్ తో అనిల్ సినిమా ఉండనుంది. ఇందులో విజయశాంతి కీలక పాత్రలో కనిపించనున్నారు. అంటే… మళ్లీ హీరోయిన్ గా నే విజయశాంతి రీ ఎంట్రీ ఇవ్వనుంది. ఆ తర్వాతే క్యారెక్టర్ ఆర్టిస్టుగా మహేష్ సినిమాలో కనిపించనుంది అన్నమాట.