చెన్నై టార్గెట్-176, ప్రసుత్తం 80/2 (10ఓవర్లు)


చెన్నై సూపర్‌ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. డేవిడ్‌ వార్నర్‌(57), మనీశ్‌పాండే(83) రెండో వికెట్‌కు 115 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పారు. వార్నర్ అవుటైన తర్వాత కూడా మనీశ్‌పాండే ధాటిగా ఆడుతూ విజయ్‌శంకర్‌(26)తో కలిసి మూడో వికెట్‌కు 47 పరుగులు జోడించాడు. కాగా చెన్నై బౌలర్లలో హర్భజన్‌ రెండు వికెట్లు తీయగా, దీపక్‌ చాహర్‌ ఒక వికెట్‌ తీశాడు.

176 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై ధాటిగా ఆడుతోంది. 10 ఓవర్లు ముగిసే సరికి రెండు వికెట్ల నష్టానికి 80 పరుగులు చేసింది. డుప్లెసిస్ (1)ని దీపిక హూడా రన్ అవుట్ చేశాడు. సురేష్ రైనా (38) రషీద్ ఖాన్ బౌలింగ్ లో అవుటయ్యాడు. ప్రస్తుతం వాట్సన్ 36, అంబటి రాయుడు 2 పరుగులతో క్రీజులో ఉన్నారు.