వాట్సన్ మెరుపులు.. చైన్నై గెలుపు !
సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై ఆరు వికెట్ల తేడాతో గెలుపొందింది. వాట్సన్ 96 (53 బంతుల్లో) రాణించడంతో చైన్నై గెలుపు సులభం అయింది. 16 ఓవర్లు పూర్తయ్యేసరికి చెన్నై రెండు వికెట్లు కోల్పోయి 150 పరుగులు చేసింది. మ్యాచ్ గెలవాలంటే 24 బంతుల్లో 26 పరుగులు చెయ్యాలి. ఆఖర్లో వాట్సన్, అంబటి రాయుడు 21 అవుటైనా.. కేదార్ జాదవ్ 11 టార్గెట్ ని పూర్తి చేశాడు.
అంతకుముందు సన్‌రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. డేవిడ్ వార్నర్(57),
మనీశ్‌పాండే(83) రెండో వికెట్‌కు 115 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పారు. వార్నర్ అవుటైన తర్వాత కూడా మనీశ్‌పాండే ధాటిగా ఆడుతూ విజయ్‌శంకర్(26)తో కలిసి మూడో వికెట్‌కు 47 పరుగులు జోడించాడు. కాగా చెన్నై బౌలర్లలో హర్భజన్ రెండు వికెట్లు తీయగా, దీపక్ చాహర్ ఒక వికెట్ తీశాడు.