ఇంటర్ కూడా పాస్ కానీ హీరోని.. !


తెలంగాణ ఇంటర్ విద్యార్థులకి సినీ స్టార్స్ సైతం ధైర్ఘ్యాన్ని చెబుతున్నారు. చదువు ఒక్కటే జీవితం కాదు. విద్యార్థులెవ్వరు ఆత్మహత్యలకి పాల్పడకూడని సలహాలిస్తున్నారు. తెలంగాణలో ఇంటర్ బోర్డ్ అవకతవకల కారణంగా చాలా మంది మెరీట్ స్టూడెంట్స్ ఫెయిల్ అయ్యారు. వీరిలో కొద్దరు మనస్థాపానికి గురై ఆత్మహత్యలకి పాల్పడుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే తెలంగాణలో 17మంది ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్యలకి పాల్పడ్డారు. ఈ నేపథ్యంలో పలువురు సినీ ప్రముఖులు విద్యార్థులకి ధైర్ఘ్యం చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా ఎనర్జిట్ స్టార్ రామ్ తెలంగాణ ఇంటర్’బోర్డ్ పనితీరుపై అసహనం వ్యక్తం చేశారు.

“ఇంటర్‌ను అసలు లెక్కలోకి తీసుకోవాల్సిన అవసరమే లేదు. ఇంటర్ పాసవడమే జీవితం అనుకుంటే.. తాను అసలు ఇంటరే పూర్తి చేయలేదు. ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫెయిల్ అయినా.. రెండో సంవత్సరం ఫస్ట్, సెకండ్ ఇయర్స్ కష్టపడి పాస్ కావొచ్చు. అంతేకాని ఫెయిల్ అయ్యామని మనసు బాధపెట్టుకొని ఆత్మహత్యలు చేసుకుంటే తల్లిదండ్రులను క్షోభ పెట్టినట్టే అవుతుంది”అన్నారు రామ్.

ఇక, సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం రామ్ పూరి దర్శకత్వంలో ఇస్మార్ట్ శంకర్ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా కోసం రామ్ సిక్స్ ప్యాక్ బాడీ చేశాడు. ఈ చిత్రంలో రామ్ సరసన నిధి అగర్వాల్, నభా నటాషాలు జతకట్టనున్నారు. ఛార్మితో కలిసి పూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో పోకిరి రేంజ్ ట్విట్ ఉండనుందట. అదే జరిగితే ఇస్మార్ శంకర్ బ్లాక్ బస్టర్ హిట్ అయినట్టే.
ఇస్మార్ట్ శంకర్ మే నెలలో విడుదల చేయాలనే ప్లాన్ లో చిత్రబృందం ఉంది.