బన్నీ-త్రివిక్రమ్ సినిమా షురు
స్టయిలీష్ స్టార్ అల్లు అర్జున్ అభిమానులకి గుడ్ న్యూస్. బన్నీ-త్రివిక్రమ్ సినిమా రెగ్యూలర్ షూటింగ్ మొదలైంది. గత యేడాదియే త్రివిక్రమ్ దర్శకత్వంలో బన్నీ సినిమా ఓకే అయిన సంగతి తెలిసిందే. ఐతే, సినిమా సెట్స్ మీదకు వెళ్లకపోవడంతో బన్నీ అభిమానులు నిరాశకు గురయ్యారు. ఇటీవలే ప్రారంభోత్సవం జరుపుకొన్న బన్నీ-త్రివిక్రమ్ సినిమా రెగ్యూలర్ షూటింగ్ ఇవాళ మొదలైంది. హైదరాబాద్ లోని బేగంపేట పోలీస్ లైన్స్ లో తొలి షెడ్యూల్ జరుగుతోంది.
బన్నీ-త్రివిక్రమ్ లది హిట్ కాంబో. వీరి కలయికలో వచ్చిన జులాయ్, సన్నాఫ్ సత్యమూర్తి మంచి విజయాన్ని అందుకొన్నాయి. ఈ నేపథ్యంలో వీరి కాంబో రాబోతున్న హ్యాట్రిక్ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. ఈ సినిమాలో బన్నీకి జంటగా పూజా హెగ్డే నటిస్తోంది. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నారు. గీతా ఆర్ట్స్ తో కలిసి హారికా & హాసినీ క్రియేషన్స్ నిర్మిస్తోంది. దసరా కానుకగా సినిమా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.