గండ్ర ఏడుపు రాజకీయం.. !
భార్య కోసం తెరాసలో చేరేందుకు రెడీ అయ్యాడు భూపాలపల్లి కాంగ్రెస్ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమాణారెడ్డి. ఆయన భార్య జ్యోతి జిల్లా పరిషత్ చైర్మైన్ పదవిని ఇస్తానని సీఎం కేసీఆర్ ఆఫర్ ఇచ్చారు. దీంతో గండ్ర దంపతులు తెరాసలో చేరబోతున్నట్టు ప్రకటించారు. ఐతే, కారెక్కె ముందే గండ్ర ఏడుపు రాజకీయానికి తెరలేపారు. మంగళవారం గండ్ర భూపాలపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో కార్యకర్తలతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా గండ్ర వెక్కి వెక్కి ఏడవటం హాట్ టాపిక్ గా మారింది.
“32 యేళ్ల రాజకీయ జీవితంలో కాంగ్రెస్‌లో వివిధ హోదాల్లో పనిచేశా. పార్టీని వీడటం బాధగా ఉంది. కానీ తప్పడం లేదు. నియోజకవర్గం అభివృద్ధి కోసం బాధాతప్త హృదయంతో తెరాసలో చేరాలని తీసుకున్న నిర్ణయం తీసుకొన్నా”నని గండ్ర తెలిపారు. దానికి ఇంత ఏడుపు రాజకీయం ఎందుకని అక్కడికి వచ్చిన కార్యకర్తలు గుసగులాడుకోవడం కనిపించింది. భార్యకు పదవి కోసమే గండ్ర పార్టీని వీడుతున్నారన్న విషయం అందిరికీ తెలుసు. అది దాచి.. అభివృది, ఆరాటం.. అంటూ గండ్ర ఏడుపు రాజకీయం చేయడం నవ్వుని తెప్పిస్తుందని ఆయన్ని ఫాలో అయ్యేవాళ్లే అంటుర్రు.
ఇక, త్వరలో తెరాసలో చేరబోయే కాంగ్రెస్ ఎమ్మెల్యే 13మంది గుంపులో గండ్ర ఒకరు కానున్నారు. వీరద్దరు కలిసి సీఎల్పీని తెరాసలో విలీనం చేసేందుకు స్వీకర్ కు లేఖ ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది. ఐతే, దీనిపై కాంగ్రెస్ లో మిగిలిపోయిన ఒకరిద్దరు నేతలు మండిపడుతున్నారు. జాతీయ పార్టీని తెరాసలో ఎలా విలీనం చేస్తారని ప్రశ్నిస్తున్నారు. దీనిపై స్వీకర్ కలిసి వినతి పత్ర కూడా అందించారు సీఎల్పీ నేత భట్టీ విక్రమ్ మార్క.
అన్నట్టు..