సల్మాన్ రికమెండేషన్ నిజమే.. !

ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ కథానాయకులుగా రాజమౌళి మల్టీస్టారర్ ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ఆలియా భట్‌ చరణ్‌ భార్య సీత పాత్రను పోషిస్తున్నారు. తారక్‌కు జోడీగా బ్రిటిష్‌ నటి డైసీ ఎడ్గార్‌జోన్స్‌ నటించాల్సి ఉంది. కానీ కొన్ని కారణాల వల్ల ఆమె సినిమా నుంచి తప్పుకొన్నారు. దాంతో రాజమౌళి కొత్త కథానాయిక కోసం వెతుకుతున్నారు.

ఈ నేపథ్యంలో బాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ సల్మాన్‌ ఖాన్‌ రాజమౌళికి ఓ సలహా ఇచ్చారట. శ్రీలంకకు చెందిన జాక్వెలీన్‌లో కాస్త బ్రిటిష్‌ పోలికలు కూడా ఉన్నాయని, తారక్‌కు జోడీగా జాక్వెలీన్‌ సరిపోతారని సల్మాన్‌.. ‘జక్కన్న’తో అన్నట్లు ఫిలిం వర్గాల సమాచారమ్. ‘కిక్‌’ చిత్రంతో సల్మాన్‌.. జాక్వెలీన్‌కు బ్రేక్‌ ఇచ్చారు. ఇండస్ట్రీలో వీరిద్దరూ మంచి స్నేహితులు.

ఇక, ఆర్.ఆర్.ఆర్ కోసం పరిణీతి చోప్రా, నిత్యా మేనన్‌ పేర్లు గట్టిగా వినిపిస్తున్నాయి. ఈ చిత్రంలో చరణ్‌ అల్లూరి సీతారామరాజు పాత్రలో, తారక్‌ కొమరం భీమ్‌ పాత్రల్లో నటిస్తున్నారు. బాలీవుడ్‌ నటుడు అజయ్‌ దేవగణ్‌ కీలక పాత్రను పోషిస్తున్నారు. 2020 జులై 30న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.