ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం
తెలంగాణ ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఫెయిలయిన విద్యార్థులు రీ వెరిఫికేషన్‌కు దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని నిర్ణయించింది.ఫెయిలయిన విద్యార్థుల జవాబు పత్రాలను పునః పరిశీలిస్తామని తెలిపింది. ఇప్పటికే రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్‌కు డబ్బులు కట్టిన వారికి తిరిగి చెల్లిస్తామని వెల్లడించింది. ఇంటర్ ఫలితాలపై బుధవారం సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్ ని ఉచితంగా నిర్వహించాలని ఇంటర్ బోర్డుని ఆదేశించారు.
అందుకు అనుగుణంగానే ఇంటర్ బోర్డ్ ఫెయిలైన విద్యార్థుల జవాబు పత్రాలను పునః పరిశీలిస్తామని ప్రకటించింది. కొందరు విద్యార్థులు తాము పాసైనా మార్కులు తక్కువగా వచ్చాయని ఆందోళన చెందుతున్నారు. రీ కౌంటింగ్ కు డిమాండ్ చేస్తున్నారు. ఐతే, ఇంటర్ బోర్డ్ మాత్రం ఫెయిలైన విద్యార్థుల పేపర్లు మాత్రమే పునః పరిశీలిస్తామని తెలిపింది. దీంతో.. పాసై తక్కువ మార్కులు వచ్చాయని ఆందోళన చెందుతున్న విద్యార్థుల సమస్యలు తీరేలే లేవనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.