ప్రభుత్వంపై హత్యా నేరం కేసు


కేసీఆర్ ప్రభుత్వంపై ప్రభుత్వంపై హత్యా నేరం కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ నేత పొన్నం ప్రభాకర్. గురువారం పొన్నం మీడియాతో మాట్లాడారు. ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలన్నీ సర్కారు హత్యలేనని ఆయన విమర్శించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వంపై హత్యా నేరం కేసు నమోదు చేయాలని, విద్యాశాఖ మంత్రి జగదీష్‌రెడ్డి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

విద్యా వ్యవస్థను ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోంది. అన్యాయాన్ని ప్రశ్నిస్తే అరెస్టులు, నిర్బంధాలతో అణచివేస్తున్నారన్నారు. ప్రభుత్వ వైఫల్యం వల్ల విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే… సీఎం కేసీఆర్‌ ప్రగతి భవన్‌లో పార్టీ ఫిరాయింపులుకు పాల్పడుతున్నారన్నారు. విద్యార్థులకు న్యాయం జరిగే వరకు కాంగ్రెస్ పోరాడుతుందని పొన్నం స్పష్టం చేశారు.

ఇదిలావుండగా.. ఇంటర్ ఫలితాల్లో తప్పిదాలు నిజమేనని ప్రభుత్వం నియమించిన త్రిసభ్య కమిటీ తేలిచింది. ఈ నేపథ్యంలోనే ఫెయిలైన విద్యార్థుల పేపర్లని పున:పరిశీలిస్తామని బోర్డ్ ప్రకటించింది. ఇప్పటికే రీ. వెరిఫికేషన్‌, రీ కౌంటింగ్‌కు డబ్బులు కట్టిన వారికి తిరిగి చెల్లిస్తామని వెల్లడించింది