పోలీస్ ఆఫీసర్’గా చైతూ


‘ఆర్‌.ఎక్స్ 100’ దర్శకుడు అజయ్ భూపతి రెండో చిత్రంగా ‘మహాసముద్రం’ కథని రెడీ చేసుకొన్నాడు. బెల్లకొండ సాయి శ్రీనివాస్ హీరోగా మహాసముద్రం సినిమా తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరిగాయి. ఐతే, ఫైనల్ గా మహా సముద్రం నాగ చైతన్య చేతులోకి వచ్చింది. ఇందులో చైతూ పోలీస్ ఆఫీస‌ర్‌గా క‌నిపించ‌నున్నాడ‌ని టాక్‌. ‘త‌ఢాకా’లో డూప్లికేట్ పోలీస్ గా క‌నిపించాడు చైతూ. త‌ను పోలీస్ పాత్ర చేయ‌డం ఇదే తొలిసారి.

మ‌హా అనే అమ్మాయి క‌థ ఇది. విశాఖ‌ప‌ట్నం ప‌రిస‌ర ప్రాంతాల‌లో జ‌రుగుతుంది. అందుకే ‘మ‌హా స‌ముద్రం’ అనే టైటిల్ పెట్టుకున్నాడు అజ‌య్‌. మాఫియా నేప‌థ్యంలో ఈ క‌థ సాగుతుంద‌ని, యాక్ష‌న్ ఎలిమెంట్స్‌కి ఎక్కువ స్కోప్ ఉన్న సీరియ‌స్ డ్రామా అని తెలుస్తోంది. ఇందులో హీరోయిన్ గా సమంతని తీసుకొనే ఆలోచనలో అజయ్ భూపతి ఉన్నట్టు తెలుస్తోంది. ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుగుతున్నాయి. త్వ‌ర‌లోనే సినిమాని సెట్స్ మీదకు తీసుకెళ్లనున్నారు.