నానికి తొలి జీతం ఇచ్చిన నిర్మాత !


ప్రముఖ టాలీవుడ్ నిర్మాత కోనేరు అనిల్ కుమార్ కన్నుమూశారు. ఆయన మృతిపట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకొంటున్నారు. నేచురల్ స్టార్ నాని కూడా కొనేరుతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకొన్నారు. బాపు దర్శకత్వంలో వచ్చిన ‘ రాధా గోపాళం’ సినిమాకి నాని అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసిన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి కోనేరు అనిల్ కుమార్ నిర్మాతగా వ్యవహరించారు.

నాని తొలి జీతం కూడా కోనేరు చేతుల మీదుగా తీసుకొన్నారట. ఇప్పుడా విషయాన్ని నాని గుర్తు చేసుకొన్నారు. “అసిస్టెంట్ డైరెక్టర్ గా నా తొలి జీతం కోనేరు చేతుల మీదుగా తీసుకొన్నా. ఆయన నా మొదటి నిర్మాత. నా సహచరుడు. నా కుటుంబం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నా”నని నాని ట్విట్ చేశారు.