15మంది ఉగ్రవాదులు హతం

శ్రీలంక ప్రభుత్వం ఉగ్రవాదులని ఏరివేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. శుక్రవారం రాత్రి శ్రీలంక భద్రతా బలగాలు 15మంది ఉగ్రవాదులని మట్టుపెట్టాయి. అంపార ప్రాంతంలోని సెంథామారుతూ వద్ద ఓ ఇంట్లో ఉగ్రవాదులు దాక్కుతున్నారనే సమాచారంతో శ్రీలంక భద్రతాదళాలు దాడులు నిర్వహించాయి. ఈ దాడుల్లో 15మంది ఉగ్రవాదులని మట్టుబెట్టాయి. ఐతే, ఈ దాడులు ఆరుగురు చిన్నారులు మృతి చెందడం విచారకరం. ఉగ్రవాదులు తిష్టవేసిన ఇంట్లో డిటోనేటర్లు, సూసైడ్ కిట్స్, ఇస్లామిక్ స్టేట్ జెండాలు లభించినట్టు సమాచారమ్.

ఇటీవల శ్రీలంక రాజధాని కొలంబోలో జరిగిన వరుస పేలుళ్లలో 300మందికిపైగా మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దేశంలోకి ప్రవేశించిన ఉగ్రవాదులని మట్టుపెట్టేందుకు శ్రీలంక ప్రభుత్వం లుకవుట్ నోటీసులు జారీ చేసింది. దాదాపు పదివేల మందితో సైనికులతో ప్రార్థనాలయాలు, సముద్ర తీరప్రాంతాల్లో గస్తీ ఏర్పాటు చేసింది. ఉగ్రవాదుల కదిలికపై పక్కా సమాచారంతో శ్రీలంక భద్రతాబలగాలు దాడులు నిర్వహిస్తున్నాయి.