సన్నీలియోన్‌.. ఇది మరో యాంగిల్ !

సన్నీలియోన్‌.. శృంగార తార ఇమేజ్ నుంచి బయటికి రాలేకపోతుంది. ఆ పని మానేసి సన్నీ చాన్నాళ్లవుతోంది. బాలీవుడ్ హాట్ బ్యూటీగా పేరు తెచ్చుకొంది. ఐటమ్ సాంగ్స్ ద్వారా వివిధ భాషల ప్రేక్షకులకు బాగానే దగ్గరైంది. ఐతే, సన్నీని జనాలు చూసే దృష్టి మాత్రం మారలేదు. ఆమెని ఇంకా శృంగార తారనే చూస్తుంటారు. కొన్ని సందర్భాల్లో సన్నీని హేళన చేసిన సందర్భాలున్నాయి.

సన్నీలో మరో కోణం కూడా ఉంది. సన్నీలో మానవీయమూర్తి ఉంది. తనతో పనిచేసే ఓ ఆర్టిస్ట్ కష్టాల్లో ఉంటే తట్టుకోలేకపోయింది.
ఇటీవల ఓ షోకి హాజరైన సన్నీ ఆ ఘటనని గుర్తు తెచ్చుకొని కంటతడి పెట్టింది. సన్నీ అసిస్టెంట్ ప్రభాకర్‌కు గతేడాది రెండు కిడ్నీలు పాడైపోయాయి. కేవలం 20 శాతమే పనిచేస్తున్నాయి. ఆయన్ని ఆదుకోవడానికి సన్నీ ఆర్థిక సాయం చేసింది అయినా.. ప్రభాకర్ ని బతికించుకోలేకపోయానని సన్నీ కంటతడిపెట్టింది.

ప్రస్తుతం సన్నీ ‘కరణ్ జీత్ కౌర్ : ది అన్ టోల్డ్ స్టోరీ ఆఫ్ సన్నీలియోన్’ వెబ్ సిరీస్ తో పాటు ‘వీర మహాదేవి’ సినిమాలో నటిస్తోంది. వీర మహాదేవి ఏకంగా రూ. 150 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి దర్శకుడు వి.సి.వడివుడయన్. స్టీవ్స్ కార్నర్ పతాకంపై పోన్స్ స్టీఫెన్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.