దేశంలోకి ఉగ్రవాదులు.. ఫేక్ న్యూస్ !
భారత్ లోకి పెద్ద ఎత్తున ఉగ్రవాదులు ప్రవేశించారు. భారీ పేలుళ్లకి పాల్పడబోతున్నారు. తెలుగు రాష్ట్రాలు, తమిళనాడు, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, గోవా, పుదుచ్చేరిలలో ఉగ్రదాడులు జరగబోతున్నట్టు పోలీసులకి ఓ ఫోన్ కాల్ వచ్చింది. స్వామి సుందర్ అనే లారీ డ్రైవర్ ఈ ఫోన్ చేశాడు. దీంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. సోదాలు మొదలెట్టారు. మరోవైపు, ఫోన్ చేసిన లారీ డ్రైవర్ ని అదుపులోని తీసుకొని విచారిస్తున్నారు. ఫైనల్ గా స్వామి సుందర్ చెప్పిన ఉగ్రదాడుల విషయం అబద్దమని తేలింది.
అంతేకాదు.. ఉగ్ర అలర్ట్ పై కర్ణాటక పోలీసులు కేంద్ర హోంశాఖ రాసిన లేఖగా.. ఓ లేఖ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఐతే, ఇందులో నిజం లేదని కర్ణాటకపోలీసులు స్పష్టం చేశారు. ఇక తప్పుడు సమాచారం ఇచ్చిన లారీ డ్రైవర్ ని కర్ణాటక పోలీసులు
అవలహళ్లి ప్రాంతంలో అదుపులోకి తీసుకున్నారు. తదుపరి విచారణ కోసం బెంగళూరు నగర పోలీసులకు అప్పగించారు. దేశంలోకి ఉగ్రవాదులు ప్రవేశించారన్నది ఫేక్ న్యూస్. సో.. ప్రజలెవ్వరు భయపడాల్సిన పనిలేదు. ఫేక్ న్యూస్ నమ్మొద్దు. ప్రచారం చేయొద్దని పోలీసులు చెబుతున్నారు.