ఆ హీరోయిన్’కు సెక్స్ మార్పిడి సర్జరీ !

హీరోయిన్ అదా శర్మ మగాడిలా మారాలనుకుంటోంది. ఇందుకోసం సెక్స్ మార్పిడి సర్జరీ చేయించుకొనేందుకు రెడీ అవుతోంది. ఐతే, ఇదంతా సినిమా కోసం మాత్రమే. అదా శర్మ లీడ్ రోల్ లో ‘మ్యాన్ టు మ్యాన్’ టైటిల్ తో ఓ సినిమా తెరకెక్కనుంది. ఈ చిత్రానికి అబిర్ సేన్‌గుప్తా వహిస్తున్నారు. ట్రాన్స్ జెండర్ సబ్జెక్ట్ చుట్టూ తిరిగే కథ ఇది. ఆసక్తికరంగా ఉండబోతోంది. పూర్తి వినోదాత్మకంగా ఉంటుంది.

అదే సమయంలో సందేశాత్మకంగా తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో అదా లింగమార్పిడి చేసుకున్న మగాడి పాత్రలో
కనిపించబోతోంది. పుట్టకతో పురుషుడైన ఆమె లింగమార్పిడి చేసుకుని స్త్రీగా మారుతుంది. నవీన్ కస్తూరియా అదా శర్మ భర్త పాత్రలో కనిపించబోతున్నాడు. ఆదా శర్మ అందం చూసి ప్రేమించి పెళ్లి చేసుకున్న నవీన్ కస్తూరియా… ఆ తర్వాత అసలు విషయం తెలిసి ఎలా రియాక్ట్ అయ్యాడన్నది కథ అని చెబుతున్నారు. ఇది నిజంగా అదాకి ఛాలెంజింగ్ రోల్ అని చెప్పాలి.

ప్రస్తుతం అదా ‘కల్కీ’ సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి ప్రశాంత్ వర్మ దర్శకుడు. ఇందులో అదా రాజశేఖర్ భార్య పాత్రలో నటిస్తున్నారు. ఇటీవలే విడుదలైన కల్కీ టీజర్ కు మంచి స్పందన వచ్చింది. త్వరలోనే సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక, సినిమాలతో బిజీగా లేని అదా.. హాట్ హాట్ ఫోటోలని అభిమానులతో పంచుకుంటోంది. క్లీవేజ్ షోతో అదరగొడుతోంది.