మహేష్ సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ ఎక్కడ.. ఎప్పుడు ?

సూపర్ స్టార్ మహేష్ బాబు 25 సినిమాలు పూర్తిచేశారు. మహేష్ 25వ చిత్రం ‘మహర్షి’ మే9న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా తన కెరీర్ లో ఓ మైలురాయిగా నిలుస్తుందని మహేష్ భావిస్తున్నారు. అంతేకాదు.. ఈ సినిమాకు సంబంధించిన ఫంక్షన్స్ ని గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నారు. మే 1న హైదరాబాద్ లో మహర్షి ప్రీ-రిలీజ్ వేడుక జరగనుంది. ఈ ఫంక్షన్ కి మహేష్ తో సినిమాలు చేసిన 24చిత్రాల దర్శకులని ఆహ్వానించబోతున్నారని తెలిసింది.

ఇక మహర్షి హిట్ అయితే సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ భారీగా చేయాలని, అది కూడా ఆంధ్ర రాజధానిలో చేయాలని ఆలోచనలు సాగుతున్నాయి. మే18న విజయవాడ పిడబ్ల్యు గ్రౌండ్ వేదికగా మహెష్ సిల్వర్ జూబ్లీ వేడుక జరగే అవకాశాలున్నాయి. ఈ ఫంక్షన్ కు
సినిమా రంగంలోని అతిరథ, మహారధులందరినీ ఆహ్వానించాలని కూడా అనుకుంటున్నారు. సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ అన్నది ప్రస్తుతానికి ఆలోచన మాత్రమే. మహర్షి సూపర్ హిట్ అయితే మాత్రం కచ్చితంగా ఉంటుంది. లేదంటే లైట్ తీసుకోవడమే.