అఫీషియల్ : మెగా హీరో విలన్’గా విజయ్

కొత్త దర్శకుడు బుచ్చిబాబు సన దర్శకత్వంలో మెగా యంగ్ హీరో సాయిధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ వైష్ణవ్ తేజ్ ఎంట్రీ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి సుకుమార్ కథ అందించారు. సుకుమార్ రైటింగ్స్, మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించనున్నారు. ఈ చిత్రంలో తమిళ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి విలన్ గా నటిస్తారనే ప్రచారం జరిగింది. ఇప్పుడా ప్రచారం నిజమైంది. ఈ మేరకు మైత్రీ మూవీస్ అధికారిక ప్రకటన చేసింది.

విజయ్ సేతుపతి ఓ సినిమా ఓకే చేశాడంటే.. మేటరు ఉన్నట్టే లెక్క. ఈ నేపథ్యంలో వైష్ణవ్ తేజ్ ఎంట్రీ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడే అవకాశాలున్నాయి. ఈ చిత్రంలో వైష్ణవ్ కి జంటగా మేఘా ఆకాష్ తీసుకోవాలని చూస్తున్నట్టు తెలిసింది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నారు. త్వరలోనే సినిమాని సెట్స్ మీదకు తీసుకెళ్లనున్నారు.