రస్మికని అందంగా బంధించాడు


విజయ్ దేవరకొండ-రష్మిక మందన లది హిట్ పెయిర్. ‘గీత గోవిందం’తో మాయ చేసిందీ.. జంట. వీరిద్దరు జంటగా నటిస్తున్న రెండో చిత్రం ‘డియర్ కామ్రేడ్’. భరత్ కమ్మ దర్శకుడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కేరళ జరుగుతోంది. అక్కడ కొన్ని సీన్స్ ని రీ-షూట్ చేస్తున్నట్టు తెలుస్తోంది. షూటింగ్ స్పాట్ లో రస్మికని విజయ్ అందంగా బంధించాడు. చక్కగా వచ్చిన ఫోటోలని రస్మిక షేర్ చేసింది. ఈ పిక్ క్రెడిట్ విజయ్‌దే అని తెలిపింది రస్మిక. ఈ ఫోటోలతో సినిమాకు కూడా ప్రమోషన్ లభించినట్టయింది.

మే 31 డియర్ కామ్రేడ్ ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ నేపథ్యంలో త్వరలోనే సినిమా ప్రమోషన్స్ లో వేగం పెంచనుంది చిత్రబృందం. ఇప్పటికే రిలీజైన ఈ సినిమా టీజర్ కు మంచి స్పందన వచ్చింది. అసలు ఈ సినిమాకు ప్రమోషన్స్ అక్కర్లేదు. టీజర్ లోని ఒక్క లిప్ లాక్ సీన్ చాలనే కామెంట్స్ వినిపించాయి. ఆ రేంజ్ లో రస్మిక-విజయ్ ల కెమిస్ట్రీ వర్కవుట్ అయ్యింది. ఇక, ఈ సినిమాతో విజయ్ వంద కోట్ల టార్గెట్ పెట్టుకొన్నట్టు తెలుస్తోంది. టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర విజయ్ సినిమా సింపుల్ గా రూ. 50కోట్లు తెచ్చిపెడుతోంది. తమిళ్, మలయాళ, కన్నడల వసూళ్లని కలిపి సెంచరీ కొట్టాలన్నది విజయ్ ప్లాన్ లా కనిపిస్తోంది.