నడిరోడ్డు మీద వర్మ ప్రెస్ మీట్.. ఎందుకంటే ?

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ విజయవాడ పైపుల రోడ్డు, ఎన్టీఆర్ సర్కిల్ వద్ద నడిరోడ్డు మీద ప్రెస్ మీట్ పెడతానని ప్రకటించారు. ఈ మేరకు మీడియా, జనాలకి ఆహ్వానం తెలుపుతూ ట్విట్ చేశారు వర్మ. ఇంతకీ వర్మ ఎందుకు నడిరోడ్డుమీద ప్రెస్ మీట్ ప్లాన్ చేసినట్టు ? అంటే.. ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ మే1న ఏపీలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో విజయవాడలో ప్రెస్ మీట్ నిర్వహించాలని భావించింది చిత్రబృందం. ఇందుకోసం విజయవాడ నోవాటెల్ హోటల్’ని ఎంచుకొంది. కానీ, ఆ హోటల్ వాళ్లకి ఎవరో వార్ణింగ్ ఇవ్వటం వలన ప్రెస్ మీట్ ని క్యాన్సిల్ చేశారు. అందుకే నడ్డిరోడ్డు మీద ప్రెస్ మీట్ పెడతానంటున్నాడు వర్మ.

‘లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా ప్రెస్ మీట్ విజయవాడ నోవాటెల్ హోటల్ లో నిర్ణయించాం. కానీ ఆ హోటల్ వాళ్లు ఎవరో వార్ణింగ్ ఇవ్వటం మూలాన భయంతో కేన్సిల్ చేసేశారు. ఈ విపరీత పరిస్థితుల్లో ట్రై చేసినా అన్ని హోట్టలూ, క్లబ్బుల, మేనేజిమెంట్లు, మనందరికీ తెలిసిన ఒక వ్యక్తి భయంతో జడిసి పారిపోయారు’

‘పైపుల రోడ్డులో ఎన్టీఆర్ సర్కిల్ దగ్గర ఈరోజు సాయంత్రం 4గంటలకు నడి రోడ్డు మీద ప్రెస్ మీట్. మీడియా మిత్రులకి, ఎన్ టి ఆర్ నిజమ్తైన అభిమానులకి, నేనంటే అంతో, ఇంతో ఇష్టమున్న ప్రతీవారికీ, నిజ్జాన్ని గౌరవించే ప్రజలందరికీ మీటింగ్లో పాల్గొన్నటానికి ఇదే నా బహిరంగ ఆహ్వానం’ అంటూ వరుస ట్విట్లు చేశారు వర్మ. ఈ ప్రెస్ మీట్ లో వర్మ ఓ రేంజ్ లో రెచ్చిపోయే ఛాన్స్ ఉంది.