వారనాసిలో తెలుగు రైతులకు బెదిరింపులు
వారనాసిలో ప్రధాని నరేంద్ర మోడీపై పోటీ చేసేందుకు తెలుగు రైతులు రెడీ అయిన సంగతి తెలిసిందే. పంటకు గిట్టుబాటు ధర అంశాన్ని జాతీయ స్థాయికి తీసుకెళ్లడానికి ఈ నిర్ణయం తీసుకొన్నారు. ఇందుకోసం దాదాపు 50మంది నిజమాబాద్, నల్గొండకు చెందిన రైతులు వారవాసికి చేరుకొన్నారు. అక్కడ వీరికి స్థానిక పోలీసులు, అధికారుల నుంచి బెదిరింపులు ఎదురవుతున్నాయి. తమను ఉత్తరప్రదేశ్ ఇంటెలిజెన్స్ పోలీసులు, అధికారులను బెదిరిస్తున్నారని తెలుగు రైతులు ఆరోపిస్తున్నారు.
తెలుగు రైతులు వారనాసిలో పోటీ చేయాలంటే.. స్థానిక ఓటర్ల నామినీ అవసరం. దీంతో తెలుగు రైతులు.. స్థానిక రైతులను తమకు మద్దతు ఇవ్వాలని, నామినీలుగా బలపరచాలని కోరుతున్నారు. ఐతే, స్థానిక ఇంటెలిజెన్స్ అధికారులు నామినేషన్స్ వేయొద్దంటూ తెలుగు రైతులని బెదిరిస్తున్నారంట. దీనిపై తెలుగు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ప్రదానిపై పోటీ చేయడం వెనకకు ఎలాంటి రాజకీయ పార్టీలు లేవు. రాజకీయ ప్రయోజనం లేదు. కేవలం పసుపు పంటకు గిట్టుబాటు ధర, పసుపు బోర్డు ఏర్పాటు అంశాన్ని జాతీయ స్థాయిలో ప్రాధాన్యం కల్పించేందుకు మాత్రమే పోటీ చేస్తున్నామని తెలుగు రైతులు తెలిపిన సంగతి తెలిసిందే. తెలంగాణ లోక్ సభ ఎన్నికల్లోనూ నిజమాబాద్ లోక్ సభ స్థానం నుంచి దాదాపు 75మంది రైతులు పోటీ చేసిన సంగతి తెలిసిందే. దీంతో నిజామాబాద్ ఎన్నిక ప్రత్యేకంగా నిలిచింది.