యనమల తుఫాన్ ప్రశ్నలు.. సమాధానం చెప్పండి !
‘ఫొణి’ తుఫాను ఏపీ వైపునకు దూసుకొసోంది. రేపటికల్లా ఏపీపై తీవ్ర ప్రభావం చూపనుందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ఫొణి తుఫాన్ వలన కలిగే నష్టానికి బాధ్యలెవ్వరు ? అని సూటిగా ప్రశ్నించారు మంత్రి యనమల. ఏపీ సీఎం చంద్రబాబు నిర్వహిస్తున్న సమీక్షలపై ఈసీ ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. మరీ.. ఇప్పుడు ఫొణి దూసుకొస్తోంది. సమీక్షలు నిర్వహించకుంటే ఎలా ? తుపాను వల్ల రాష్ట్రానికి నష్టం కలిగితే ఎవరు బాధ్యులు. సీఎస్సా? ఎన్నికల సంఘమా? లేకా మోదీ ప్రభుత్వమా?’ అని ప్రశ్నించారు యనమల.
పోలవరంపై సీఎం చంద్రబాబు సమీక్ష చేయకూడదనడం విడ్డూరంగా ఉందని,జాప్యం జరిగితే పెరిగే అంచనా వ్యయానికి బాధ్యత ఎవరిదని ప్రశ్నించారు. ఎన్నికల సంఘం అప్పగించిన పనికి విరుద్ధంగా ఏపీ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం పని చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మొత్తంగా ఫొణి తుఫాన్ దూసుకొస్తున్న వేల మంత్రి యనమల కేంద్రాన్ని లాజిక్ గా ప్రశ్నించారు. తుఫాన్ ప్రమాదం వచ్చినప్పుడల్లా.. ఏపీ సీఎం ముందుగానే అధికారులని అప్రమత్తం చేసి భారీ నష్టం జరగకుండా జాగ్రత్తపడేవారు. ఇప్పుడీ ఈసీ ఆంక్షల కారణంగా చంద్రబాబు అధికారులతో సమీక్ష, సమావేశాలు నిర్వహించే పరిస్థితి లేదు. మరీ.. ఫొణి బీభత్సానికి బాధ్యత ఎవరు వహిస్తారన్నది యనమల ప్రశ్న.