కేటీఆర్ వార్నింగ్…

మంత్రికేటీఆర్ మున్సిప‌ల్ స‌మావేశంలో సీరియ‌స్ అయ్యార‌ట‌. కార్పోరేట‌ర్ల‌కు వార్నింగ్ ఇచ్చార‌ట‌. కొంద‌రు కార్పోరేట‌ర్ల‌పై అయితే కార్పోరేష‌న్లు మీ సామ్రాజ్యాలు అనుకుంటున్నారా… అధికారులు మీ డివిజ‌న్ లో తిర‌గాలంటే మీ అనుమ‌తి తీసుకోవాలా అంటూ కోప‌గించుకున్నారట‌. ఎక్కువ చేస్తే పార్టీ నుంచి సస్పెండ్ చేస్తానంటూ హెచ్చ‌రించార‌ట‌. హైదరాబాద్ అభివృద్ధిపై స‌మీక్షించిన ఆయ‌న కార్పోరేట‌ర్ల‌పై మండిప‌డ్డారు. ఇష్టం వ‌చ్చిన‌ట్లు చేయ‌డం ప‌ద్ద‌తి కాద‌ని, తీరు మార్చుకుని జాగ్ర‌త్త‌గా ప‌నిచేయాలంటూ హిత‌వు ప‌లికారు.

అధికారుల వెంట ప‌డి ప‌నిచేయించుకోవాల‌ని, ఎవ‌రైనా ఇబ్బంది పెడితే త‌న‌కు చెప్పాలి త‌ప్ప ఇష్టారీతిన వ్య‌వ‌హ‌రించ‌డం మంచిది కాద‌ని చెప్పార‌ట‌. ఇప్ప‌టికే ప‌లువురు కార్పోరేట‌ర్ల తీరుపై ప్ర‌జ‌ల్లో వ్య‌తిరేక‌త వ‌చ్చిన నేప‌థ్యంలో పార్టీకి , ప్ర‌భుత్వానికి చెడ్డ‌పేరు రాకుండా జాగ్ర‌త్త‌లు తీసుకునేందుకే ఆయ‌నవారిని ఇలా హెచ్చ‌రించార‌ని తెలుస్తోంది. కేటీఆర్ హెచ్చ‌రిక‌ల‌తోనైనా కార్పోరేట‌ర్ల ప్ర‌వ‌ర్త‌న‌లో మార్పు వ‌స్తుందో లేదో చూడాలి మ‌రి.