హార్ఠిక్ పోరాటం వృథా.. ముంబై ఓటమి !

హార్దిక్‌పాండ్య (91; 34 బంతుల్లో 6×4, 9×6) విధ్వంసక ఇన్నింగ్స్‌ వృథా అయింది. ముంబయి ఇండియన్స్‌ నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 198 పరుగులే చేసింది. దీంతో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ 34 పరుగుల తేడాతో విజయం సాధించింది. 233 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై మొదట 58 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఐతే, ఆ జట్టుని హార్దిక్‌ పాండ్య, పొలార్డ్‌(20) ఆదుకున్నారు. వీరిద్దరూ ఐదో వికెట్‌కు 63 పరుగులు జోడించాక పొలార్డ్‌ ఔటయ్యాడు.

ఆ తర్వాత కూడా హార్దిక్‌పాండ్యా విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 17బంతుల్లోనే అర్థశతకం పూర్తి చేశాడు. కృనాల్‌ పాండ్య(24; 18బంతుల్లో 2×6)తో 64 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. ముంబైని గెలిపించేంత పని చేశాడు. ఐతే, 91పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద భారీ షాట్ కి ప్రయతించి అవుట్ అయ్యాడు. మొత్తం మ్యాచ్ లో హార్థిక్ ఇన్నింగ్స్ నే హైలైట్.

అంతకుముందు శుభ్‌మన్‌గిల్‌(76; 45 బంతుల్లో 6×4, 4×6), క్రిస్‌లిన్‌(54; 29 బంతుల్లో 8×4, 2×6), ఆండ్రీ రసెల్‌(80; 40బంతుల్లో 6×4, 8×6) రాణించడంతో కోల్ కతా 232 పరుగులు చేసింది.