ఆ విషయాలు అర్థంకానీ రానా.. !
క్రికెట్, అమ్మాయిలు, పెళ్లి, పిల్లలు.. తనకు అర్థంకావు అన్నారు రానా దగ్గుపాటి. ఇవన్నీ అర్థంకానీ తనకే జెర్సీ సినిమా చూసి ఏడుపొచ్చింది అంటే.. ఇక ప్రేక్షకులు పరిస్థితి ఏంటన్నది అర్థం చేసుకోవచ్చు అన్నారు. ఆదివారం హైదరాబాద్ లో జెర్సీ సక్సెస్ మీట్ జరిగింది. ఈ కార్యక్రమానికి రానా ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా రానా మాట్లాడుతూ.. ‘సినిమాపై నానికి ఉన్న గౌరవం గొప్పది. ఆయన ఇలాగే విజయం సాధించాలని ఆకాంక్షించారు. దర్శకుడు గౌతమ్ తిన్ననూరి సినిమాని అద్భుతంగా తీశారని కితాబిచ్చారు. సినిమా అన్నది శాశ్వతం. జెర్సీ సినిమా మీ జీవితాంతం గుర్తుండిపోయే సినిమా’ అన్నారు రానా.