కేంద్రమంత్రి కారుపై దాడి
సార్వ్రత్రిక ఎన్నికల నాలుగో విడత పోలింగ్ కొనసాగుతోంది. ఈ దశలో పశ్చిమబెంగాల్‌లోని 8 లోక్‌సభ నియోజకవర్గాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. పోలింగ్ కేంద్రాల వద్దే తృణమూల్ కాంగ్రెస్, భాజపా కార్యకర్తలు ఘర్షణకు దిగారు. దీంతో ఆందోళనకారులను అదుపుచేసేందుకు పోలీసులు లాఠీఛార్జ్ చేయాల్సి వచ్చింది. మరోవైపు ఆసన్‌సోల్ ప్రాంతంలో కేంద్రమంత్రి బాబుల్ సుప్రియో కారుపై కొందరు దాడి చేశారు.
పోలింగ్ కేంద్రం వద్దకు వచ్చిన బాబుల్ సుప్రియోను కొందరు ఆందోళనకారులు అడ్డుకునేందుకు యత్నించారు. ఈ క్రమంలో ఆయన కారు అద్దాలు పగలగొట్టారు. ‘పోలింగ్ కేంద్రం వద్ద ఓటర్లను అడ్డుకుంటున్నారని సమాచారం రావడంతో నేను ఇక్కడకు వచ్చాను. అప్పుడే కొందరు నా కారుపై దాడి చేశారు’ అని సుప్రియో తెలిపారు.