ఆ కేసులో.. షమీ భార్య అరెస్ట్ !

టీమిండియా బౌలర్ మహ్మాద్ షమీ భార్య మహ్మాద్ షమీని పోలీసులు అరెస్ట్ చేశారు. తమ ఇంట్లోకి హసీన్ జహాన్ అక్రమంగా ప్రవేశించిందని మహ్మద్ షమీ తల్లి పోలీసులకి ఫిర్యాదు చేసింది. దీంతో ఆమెని సెక్షన్ 151 కింద పోలీసులు అరెస్టు చేశారు. ఆదివారం రాత్రి జరిగిన ఈ ఘటన కాస్త ఆలస్యంగా వెలుగులోని వచ్చింది.

గతేడాది హసీన్ జహాన్… భర్త షమీపై తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. షమీకి తనని ఘోరంగా హింసించే వాడు. ఆయనకు పలువురు అమ్మాయిలతో అక్రమ సంబంధం ఉందని ఆరోపించారు. ఇప్పుడీ కేసు కోర్టు పరిథిలో ఉంది. ఈ నేపథ్యంలో హసీన్ జహన్ షమీ ఇంటికి వచ్చి గొడవ చేయడంతో.. ఆమెని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం షమీ ఐపీఎల్ లో పంజాబ్ జట్టు తరుపున ఆడుతున్నారు. ప్రపంచకప్ ఆడబోయే జట్టులోనూ చోటు దక్కించుకొన్నాడు.