అఖిల్ సినిమాలో అల్లు అర్జున్ రోల్.. ఇదే !

అఖిల్ అక్కినేని ఇంకా మూడులోకి రాలేదు. ఆయన నటించిన తొలి మూడు సినిమాలు ప్లాప్ అయ్యాయి. అఖిల్, హలో, మిస్టర్ మజ్ను తీవ్రంగా నిరాశపరిచాయి. ఫైనల్ గా అఖిల్ కి హిట్ ఇచ్చే బాధ్యతని అల్లు అరవింద్ తీసుకొన్నారు. అఖిల్ నాల్గో సినిమా గీతా ఆర్ట్స్ బ్యానర్ లో తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకుడు. ఓ విభిన్నమైన కథని అఖిల్ కోసం రెడీ చేశాడట. ఇందులో హీరోయిన్ పాత్రకి అధిక ప్రాధాన్యం ఉంటుందట. అందుకే కాస్త అనుభవం ఉన్న హీరోయిన్ ని తీసుకోవాలని చూస్తున్నారు. అంతేకాదు.. ఇందులో అల్లు అర్జున్ గెస్ట్ రోల్ లో కనిపించబోతున్నట్టు సమాచారమ్.

కథతో సంబంధం లేని, పెద్దగా ప్రాధాన్యత లేని పాత్రలో బన్నీ గెస్ట్ రోల్ లో కనిపించి సప్రైజ్ చేస్తాడట. సినిమాపై అంచనాలు పెంచేందుకే అల్లు అరవింద్ ఈ ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. అఖిల్ సినిమాపై స్పెషల్ ఫోకస్ పెట్టమని అరవింద్ ని నాగార్జున స్పెషల్ రిక్వెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే అఖిల్ నాల్గో సినిమాలో సాధ్యమైనని ప్రత్యేకలని జోడించేందుకు అరవింద్ ట్రై చేస్తున్నట్టు కనిపిస్తోంది. ఇక, ఈ చిత్రానికి గోపి సుందర్ సంగీతం అందిస్తున్నాడు. అఖిల్ కి జంటగా రష్మిక మందన జతకట్టనుంది. త్వరలోనే సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది.